Sunday, April 4, 2010

సానియా వివాహం మీడియా అతి ఉత్సాహం

గత రెండు రోజులుగా ఎలక్ట్రానిక్ మీడియా సానియా వివాహ సందర్భంగా ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే అస్సలు సంచలన వార్తల కోసం మన మీడియా ప్రతినిధులు ఎంతవరకైనా వెళ్తారని మరొక్కసారి నిరుపించుకున్నారు

ఒక అమ్మ్మాయి ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు . కాని వారిద్దరూ తమ తమ క్రీడలలో పేరొందిన క్రీడాకారులు కాబట్టి ఒక టీవీఛానల్ ప్రకారం వారు అన్ని విషయాలు గోప్యంగా ఉంచుతున్నారు .అంటే వీరి ఉద్దేశ్యంలో వారు ఇరువురు ప్రఖ్యాత క్రీడాకారులు గాబట్టి ప్రతి విషయం మీడియా ముందుకు వచ్చి వీరికి చెప్పాల్సిన అవసరం ఉంది.అంటే మేహేంది కార్యక్రమం కాని అదేవిధం నగల విషయం గాని వారు పెళ్లి రోజున వేసుకునే బట్టలవిషయం గాని ప్రతి విషయం ముందుగా వీరి చెప్పాలి లేకపోతె యింక వీరి ఇష్టం.

ఇంకొక ఛానల్ ఐతే శోయిబ్ ని దొంగ అల్లుడు గా చిత్రికర్రించి హెడ్ లైన్స్ అదే విధం గా చూపెట్టింది.
పెళ్లి అనేది వ్యక్తిగతం అని షోయాబ్ కి వేరొక వివాహం నిజంగా జరిగినా అది తనకి సానియాకు సంబందించిన విషయం అని అది కేవలం ఒక వార్తగా చుపెట్టాలేగాని వ్యక్తుల్లకి రకరకాలుగా పేర్లు పెట్టి వారిని దోషులుగా చూపెట్టడం ఎంతవరకు సబబు.
ఇంకపోతే శివసేన అధినేత ఎక్కడ ప్రజలు తమను మరిచిపోతారో అని అప్పుడప్పుడు ఒక ప్రకటన ఇస్తూ ఉంటారు
హైదరాబాద్ లో ఎన్నో కుటుంబాలు పాకిస్తాన్ కుటుంబాలతో వివాహ సంబంధాలు ఏర్పరుచుకొని హాయిగా ఉంటున్నారు.
ఈ మీడియా విచారణ ఎంతవారకు సమంజసం
హటాత్తుగా కొంతమంది విలేఖరులకు మరియు శివసేన అధినేతలకు సానియా లొఏం ప్రతిభ లేదని కేవలం అందంతో
పైకి వచ్చింది అని వ్యాఖ్యానించడం అతి శోచనీయం
ఇప్పటికైనా సానియా ని శోయిబ్ ని వడిలేసి. వారి వ్యకిగత జీవితాల్లో ఇదొక ముఖ్యమైన రోజు ,వారిని ఎంజాయ్ చేయనీయండి

ఏదైనా మంచి పోటిల గురించి కాని ఒక మంచి క్రీడాకారుడు కాని క్రీడాకారిణి గురించి కాని వారి వారు సాధిచిన విషయాలగురించి కాని చూపెట్టడానికి మన చన్నెల్స్ కు ఎక్కడ సమయం సరిపోదు . కాని ఇటువంటి విషయాలకోసం రాత్రింబవళ్ళు ఓ బి వాన్స్ పెట్టుకొని, ఇంతకూ ముందు సోహ్రాబ్ ఇంటిముందు పడిగాపులు కాసి ఆటను ఇంట్లోంచి బయటకు వస్తుంటే వెళ్తుంటే అయాదృశ్యాలను తీసి కేవలం మా చానెల్ ప్రత్యేకం అని వేసుకుని ఇపుడు అదే విధం గా సానియా ఇంటి ముందు కుర్చుని కాపలా కాస్తూ వీరి తో ఎవ్వరు మాట్లాడలేదని ఇక్కడ అన్ని గోప్యంగా జరుగుతున్నాయి అని ప్రసారం చేయడం ఎంతవరకు సమజసమో వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం

అంటే కాదు కొన్ని చాన్నేల్స్ మరింత ముందుకు వెళ్లి అస్సలు వివాహమే రద్దు ఐపోయింది అని మరికొంతమది నిన్ననే నిఖా ఐపోయింది అని ప్రసారం చేసేసారు . అంటే వీరి ఉద్దేశ్యం ఏదో ఒక వార్తా ప్రసారం చేసేస్తే వాళ్లు ఖండిచడానికో లేకపొతే వివరణ ఇవ్వడానికో చచ్చినట్టు వస్త్తారని వ్యుహమా?
ఏది ఏమైనా కుడా మొత్తం వ్యవహారంలో మీడియా పాత్ర ఎ విధంగా చూసిన కూడా సమర్ధనియంగా లేదు
శ్రీ శ్రీ గారు అన్నట్టు వ్యక్తుల ప్రైవేటు జీవితాలు ఎవ్వరివి వారివి కాని పబ్లిక్ లొ వస్తే ఏమైనా అంటాం కొడుతాం కాని పడుండాలి అన్నది తుచ తప్పకుండ పాటిస్తున్నట్లు కన్పిస్తోంది . మహాకవి శ్రీశ్రీ అన్నది ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తుల గురించి వారి అవినీతి కార్యకలాపాల గురించి అంటే కాని వ్యక్తుల వ్యక్తిగత జీవితంలో దూరి వారి ని బజార్ కు ఈడ్చడం గురించి కాదు.